రాత్రిపూట భోజనం ఆలస్యంగా చేస్తున్నారా.. రాత్రి 9 గంటల దాటిన తర్వాత ఇష్టమైన నాన్ వెజ్, వెజ్కడుపునిండా తింటున్నారా..? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే.. మీకై మీరు చేజేతులా మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్లే.. లేట్‌నైట్ డిన్నర్ వల్ల కలిగే దుష్ఫలితాలు, కలిగే అనారోగ్య సమస్యలు, రాత్రిళ్లు ఏ టైంలో తినాలి.. ? ఎంత తినాలి ? వంటి ఆరోగ్యకరమైన అంశాలు తెలుసుకుందాం..
చలికాలం (శీతాకాలం)లో పగలు తక్కువ, రాత్రి ఎక్కువగా ఉంటుంది మనకు తెలుసు.. ఈ సమయంలో మన శరీర జీవక్రియల్లో చాలా మార్పులు వస్తాయి. జీర్ణక్రియ, జీవక్రియ, హార్మోన్ల విడుదల, నిద్రపై చాలా ప్రభావం ఉంటుంది. ఇటువంటి కోల్డ్సీజన్ లో మీరు ఎప్పుడు తింటారు.. ఏమి తింటారు అనే దానిపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.. సరైన సమయంలో తినడం వల్ల జీర్ణక్రియ, శక్తి స్థాయిలు ,మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నారు.
లేట్-నైట్ డిన్నర్ వల్ల ఎసిడ్ రిఫ్లక్స్, జీర్ణ సమస్యలు, బరువు పెరగడం, నిద్రలేమి, డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆలస్యంగా తినడం వల్ల శరీరం జీవక్రియ ప్రక్రియలకు ఆటంకం కలిగిస్తుంది. ముఖ్యంగా జీర్ణక్రియ,నిద్రపై ప్రభావం చూపుతుంది.
చలికాంలో ఎందుకు ముందు తినాలి..?
రాత్రి భోజనం 9 గంటలు దాటిన తర్వాత అంటే రాత్రి 10గంటలు ఆపైన సమయాల్లో భోజనం చేయడం ఆరోగ్యానికి అంత మంచిదికాదంటున్నారు ఆరోగ్యనిపుణులు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, కొవ్వు వినియోగం మందగిస్తుంది. సాయంత్రం 6 గంటల ముందు కూడా భోజనం చేయడం అంత మంచిదికాదు. జీర్ణక్రియ సరిగా ఉండదు. నిద్ర పోయే కొన్ని గంటలకుముందు భోజనం చేస్తే జీవక్రియ చాలా చురుగ్గా పనిచేస్తుందంటున్నారు. దీనివల్ల మీ జీర్ణవ్యవస్థ విశ్రాంతి తీసుకునేందుకు సమయం లభిస్తుంది. ఆరోగ్యకరమైన నిద్రను అందిస్తుంది.
అదే రాత్రి చాలా ఆలస్యంగా తినడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీని వలన నిద్ర నాణ్యత సరిగా ఉండదు. అలసట ,మానసిక స్థితిలో మార్పులు కూడా వస్తాయి. అదనంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఊబకాయం ,టైప్ 2 డయాబెటిస్ వంటి జీవక్రియ రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతాయి.
చలికాలంలో భోజనం టైమింగ్స్.. చిట్కాలు
- చలికాలంఓల పడుకునే 2 -నుంచి 3 గంటల ముందు భోజనం చేయాలి. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య రాత్రి భోజనం చేయడంఆరోగ్యానికి మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
- సహజంగానే పగటిపూట జీవక్రియ చురుగ్గా ఉంటుంది కాబట్టి బ్రేక్ ఫాస్ట్, భోజనం తగినంత తినొచ్చు.
- రాత్రిపూట పని చేసేవారు లేదా వ్యాయామం చేసేవారు పడుకునే ముందు భారీ భోజనం కంటే చిన్న, తేలికపాటి స్నాక్స్ తీసుకోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు
