ఆ దేశాల విమానాలను ఆపేయండి

V6 Velugu Posted on Nov 27, 2021

కరోనా కొత్త వేరియంట్ బారినపడుతున్న దేశాల నుంచి విమాన సర్వీసులను ఆపేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఆఫ్రికన్ దేశాలలో కొత్త మ్యుటెంట్ కేసులు పెరుగుతుండటంతో.. కరోనా వైరస్, తాజా పరిస్ధితులపై ఆయన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ.. కరోనా కొత్త వేరియంట్ దేశంలోకి రాకుండా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు ప్రారంభించాలని ఆయన అన్నారు. దేశం ఇప్పుడిప్పుడే కరోనా నుంచి అతికష్టం మీద కోలుకుంటోందని.. ఇలాంటి సమయంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగితే చాలా నష్టం వాటిల్లుతుందని ఆయన అన్నారు. అందుకే కొత్త వేరియంట్ వ్యాప్తిచెందుతున్న దేశాల నుంచి విమాన రాకపోకలను నిలిపివేయాలని ప్రధానిని సీఎం కేజ్రీవాల్ కోరారు.

 

Tagged pm modi, Delhi, CM Arvind Kejriwal, Corona New Variant, stop Flights, african Countries

Latest Videos

Subscribe Now

More News