ఆర్టీసీ కార్మికులపై వేధింపులు ఆపాలె : బర్కత్ పుర డిపో ఎదుట ధర్నా

ఆర్టీసీ కార్మికులపై వేధింపులు ఆపాలె : బర్కత్ పుర డిపో ఎదుట ధర్నా

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో యూనియన్లు లేకపోవటంతో అధికారులు కార్మికులను వేధిస్తున్నారని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి, వైస్ చైర్మన్ హనుమంతు ఫైర్ అయ్యారు. హైదరాబాద్, బర్కత్ పుర డిపోలో కండక్టర్ రాధికను వేధించిన డిపో అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్), చీఫ్ ఇన్స్ పెక్టర్ నమ్రతను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కండక్టర్ రాధికను అవమానిస్తూ, వేధిస్తూ, భయభ్రాంతులకు గురి చేయటం వల్లే మంగళవారం డిపోలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడే ప్రయత్నం చేసిందన్నారు. 

బుధవారం మధ్యాహ్నం బర్కత్ పుర డిపో ఎదుట ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ.. ప్రశ్నిస్తే అంతు చూస్తానంటూ సీఐ కార్మికులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. సీఐను బెదిరించడానికే రాధిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు అధికారుల ఎంక్వైరీలో తేలిందని ఆర్టీసీ ఎండీ  సజ్జనార్​ పత్రికా ప్రకటనలో తెలిపారు.