సమ్మె విరమించిన ఆర్టీసీ జేఏసీ

సమ్మె విరమించిన ఆర్టీసీ జేఏసీ

RTC సమ్మె భేషరతుగా విరమిస్తున్నట్లు ప్రకటించారు జేఏసీ నేతలు. రేపు ఉదయం 6 గంటల నుంచే కార్మికులంతా విధుల్లోకి హాజరుకావాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు జేఏసీ నేతలు. అక్టోబర్ 5 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లారు. 52 రోజుల పాటు సుధీర్ఘంగా సమ్మె సాగింది.

రేపు డిపోలకు వెళ్లి విధులు నిర్వహించేందుకు రెడీగా ఉండాలన్నారు అశ్వత్థామరెడ్డి.  52 రోజుల పాటు సమ్మె.. కార్మికుల నైతిక విజయమన్నారు.  రేపట్నుంచి తాత్కాలిక కార్మికులు విధులకు రావొద్దన్నారు. సమ్మెకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీని బతికించుకునేందుకే తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మె విరమిస్తున్నామని ప్రకటించారు జేఏసీ నేతలు. సమ్మె విరమిస్తుంన్నందున ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి, సమస్యలు పరిష్కారం అయ్యేందుకు జేఏసీ పనిచేస్తుందన్నారు నేతలు.