యుద్ధం ఆపండి.. ప్రపంచాన్ని కాపాడండి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

యుద్ధం ఆపండి.. ప్రపంచాన్ని కాపాడండి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  •     పశ్చిమాసియా ఉద్రిక్తతలపై అసెంబ్లీలో తీర్మానం

హైదరాబాద్, వెలుగు: పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ మానవాళి మనుగడకే ముప్పుగా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధా న్ని ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చొర వ చూపి, అంతర్జాతీయ వేదికలపై శాంతి కోసం కృషి చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో ఆయన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 

ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్​లో క్రూడాయిల్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోందని భట్టి పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి ప్రతి దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతోందన్నారు. ఇంతటితో ఈ యుద్ధం ఆగకపోతే భవిష్యత్తు అంధకారమవుతుందని, ప్రపంచ శాంతిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.