
జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో వీధి కుక్కలు చెలరేగిపోతున్నాయి. తాజాగా చింతల్ వెంకటేశ్వరనగర్‌లో 7వ తరగతి బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. మెహిత్ చరణ్(12) శనివారం మధ్యాహ్నం ఇంటి సమీపంలోని కిరాణా షాప్‌కు వెళ్లగా, ఓ కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో బాలుడి పిక్కలకు తీవ్ర గాయాలు పాలయ్యాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో కుత్బుల్లాపూర్సర్కిల్పరిధిలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వాటికి టీకాలు వేయడంతోపాటు షెల్టర్లకు తరలించాలని కోరుతున్నారు.