బడంగ్​పేటలో బాలుడిపై వీధి కుక్కల దాడి

బడంగ్​పేటలో బాలుడిపై వీధి కుక్కల దాడి

ఎల్ బీనగర్, వెలుగు: ఐదేండ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడిచేశాయి. ఈ ఘటన బడంగ్ పేట కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడ టీచర్స్ కాలనీలో జరిగింది. శనివారం కాలనీలోని ప్రకృతి అపార్ట్​మెంట్ వాచ్​మెన్ కుమారుడు నాని(5) ఇంటి బయట ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. తల్లిదం డ్రులు వెంటనే నారాయణగూడలోని   ఆసుపత్రికి తరలించారు. కుక్కల బెడదపై ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కుక్కలు ఎక్కువ కావడంతో పిల్లల్ని ఒంటరిగా బడికి పంపాలన్నా భయంగా ఉంటోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.