ఢిల్లీలో ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లే స్ట్రీట్ డాగ్స్ సమస్య తీవ్రం: సుప్రీంకోర్టు

ఢిల్లీలో ఆఫీసర్ల  నిర్లక్ష్యం వల్లే స్ట్రీట్ డాగ్స్ సమస్య తీవ్రం: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో  స్ట్రీట్ డాగ్స్ సమస్యకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని సుప్రీంకోర్టు త్రీ-జడ్జ్ బెంచ్ అభిప్రాయపడింది. వారు తగిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదని తెలిపింది. స్ట్రీట్ డాగ్స్ పట్ల కోర్టు సానుభూతితోనే ఉన్నదని.. కానీ ప్రజల భద్రత కూడా ముఖ్యమని స్పష్టం చేసింది. 

ఢిల్లీలోని స్ట్రీట్ డాగ్స్‌‌‌‌అన్నింటిని షెల్టర్లకు తరలించాలని డివిజన్ బెంచ్ గతంలో ఇచ్చిన ఆదేశాలను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ అంజారియాతో కూడిన బెంచ్ గురువారం రివ్యూ చేసింది. ప్రజా భద్రత, జంతు శ్రేయస్సు రెండూ ముఖ్యమేనని స్పష్టం చేసింది. అనంతరం ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేసింది.