
పద్మారావునగర్, వెలుగు: కొందరు స్ట్రీట్వెండర్లు శుక్రవారం చిలకలగూడ ట్రాఫిక్పోలీసులను కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. 20 ఏండ్లుగా ఆలుగడ్డ బావి బస్టాప్ నుంచి తార్నాక ఆఫీసర్స్ క్లబ్ వరకు హైవేకు ఇరువైపులా చిరు వ్యాపారాలు చేస్తున్నామని మెట్టుగూడ, తార్నాక మీల్స్ ఫుడ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చింత రమేశ్ చెప్పారు. ట్రాఫిక్పోలీసుల చర్యలతో నాలుగు నెలలుగా వ్యాపారం లేకుండా పోయిందన్నారు. మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత మాట్లాడుతూ చిరువ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దన్నారు.