కొన్ని గంటల్లోనే 30సెం.మీ.వర్షపాతం

కొన్ని గంటల్లోనే 30సెం.మీ.వర్షపాతం

గుజరాత్ ను  జూలై 18న భారీ వర్షాల కారణంగా  పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలో గడిచిన కొన్ని గంటల్లోనే 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. దీంతో  రాజ్‌కోట్, సూరత్ ,గిర్ సోమనాథ్ జిల్లాల్లో కుండపోత వర్షంతో  లోతట్టు ప్రాంతాలన్నీజలమయం అయ్యాయి. వీధుల్లో  ఎటూ చూసినా వరదే కనిపిస్తోంది.   కార్లు వీధుల్లో తేలియాడుతున్నాయి.   ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మంగళవారం ఉదయం 6 గంటల నుండి కేవలం 14 గంటల్లో 345 మి.మీ..  రాజ్‌కోట్ జిల్లాలోని ధోరాజి తాలూకాలో కేవలం 14 లో 250 మి.మీ.వర్షపాతం నమోదయ్యింది.  రాబోయే రెండు రోజుల్లో గుజరాత్ లోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది.