దళిత బంధు పేరుతో డబ్బులడిగితే కఠిన చర్యలు

దళిత బంధు పేరుతో డబ్బులడిగితే కఠిన చర్యలు

మధిర: దళిత బంధు పేరుతో డబ్బులడిగితే దళారులు, బ్రోకర్ల తాటతీస్తానని, వారిపై కేసులు పెట్టిస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హెచ్చరించారు. తన పాదయాత్రలో భాగంగా 10 రోజు చింతకానిలో భట్టి పర్యటించారు. స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చింతకానిలో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం డబ్బులు ఇప్పించే బాధ్యత తనదేనన్నారు. ఎవరూ కూడా దళారులు, బ్రోకర్ల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా దళితుల అభివృద్ధికి కృషి చేశామని చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం..

ఆర్టీసీ చార్జీలు రూ. 5 నుంచి 14 వరకు పెరిగే చాన్స్

ఆగని పెట్రో ధరలు.. ఆరు రోజుల్లో 5 సార్లు పెంపు