వీడియో: గుడ్లగూబకు డైటింగ్.. బరువు తగ్గగానే తుర్రుమంది..

వీడియో: గుడ్లగూబకు డైటింగ్.. బరువు తగ్గగానే తుర్రుమంది..

ముద్దుగా బొద్దుగా ఉన్న ఓ గుడ్లగూబ గొయ్యిలో పడిపోయింది. ఎగరడానికి ఇబ్బందులు పడుతోంది. బ్రిటన్‌లోని సఫోల్క్ ఓవెల్ శాంక్చువరీ ఆఫీసర్ల కంటపడింది… పాపం దానికి ఏదైనా గాయమైందేమో అనుకున్నరు. కానీ తీరా చూస్తే అధిక బరువుతో అది పైకి ఎగరలేకపోతోందని తెలిసింది. ఉండాల్సిన బరువు కంటే మూడు రెట్లు అధికంగా ఉందని గుర్తించారు. ఆ చిన్ని ఆడ గుడ్లగూబ 245 గ్రాముల బరువుందట. ఇంత బరువు ఉండడంతోనే ఎగరలేకపోయిందట. దీంతో దాని బరువు తగ్గించాలని నిర్ణయించారు ఆఫీసర్లు. అంతే శాంక్చువరీకి తీసుకెళ్లి స్ట్రిక్ట్ డైట్ మెయింటెయిన్ చేయించారు. కొన్ని వారాల్లోనే ఓవెల్ బరువు తగ్గింది. దీనికి ప్లంప్ (పుష్టిగా ఉండే) అని ముద్దు పేరు పెట్టుకున్న ఆఫీసర్లు… బరువు తగ్గడంతో శాంక్చువరీ నుంచి పంపించేశారు. ఆ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. అడవిలోనూ అది డైట్ మెయింటెయిన్ చేస్తుందని ఆశిద్దాం… అంటూ దీనిపై నెటిజన్ లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.