- స్టేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను కారుతో ఢీ కొట్టిన గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలని తెలంగాణ స్టేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సౌమ్యకు మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు చేపట్టిన మంత్రులు జూపల్లి, దామోదరకు అసోసియేషన్ అధ్యక్షుడు సూర కృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రులతోపాటు బాధితురాలి చికిత్సకు సహకరించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్, అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, డీపీఈఓ మల్లారెడ్డికి అసోసియేషన్ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.
సౌమ్యకు చికిత్స అందించేందుకు రూ.10 లక్షలు మంజూరు చేయడం హర్షణీయమని, ఆమె కుటుంబానికి అసోసియేషన్ అండగా నిలుస్తుందని అధ్యక్షుడు సూర కృష్ణ. ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రావు, కోశాధికారి సూర కిష్టయ్య, జాయింట్ సెక్రటరీ పి.వెంకటేశ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రవణ్, గౌరవ అధ్యక్షుడు మధుబాబు పేర్కొన్నారు.
