SRH: బ్యాటింగ్లో అదుర్స్.. బౌలింగ్లో బెదుర్స్.. SRHపై CSK మాజీ ప్లేయర్ హాట్ కామెంట్స్

SRH: బ్యాటింగ్లో అదుర్స్.. బౌలింగ్లో బెదుర్స్.. SRHపై CSK మాజీ ప్లేయర్ హాట్ కామెంట్స్

SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ఎడిషన్ ప్రారంభానికి మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. మార్చి 28వ తేదీన జరిగే తొలి మ్యాచ్ లో ఢిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ పోరుకి  ముందు ఎస్ఆర్హెచ్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ అభినవ్ ముకుంద్ చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్ గురి చేస్తున్నాయి. గత సీజన్ లో  ఆశించిన మేర రాణించకపోయిన హైదరాబాద్ టీమ్,  ఈసారి కనీసం ప్లేఆఫ్స్ కి అయినా చేరుకోవాలని చూస్తుంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ లాంటి స్టార్ ప్లేయర్స్ తో అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ ఉంది.

ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఆరంభ మ్యాచులకి దూరం కానుండటంతో పాటు సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని లక్నో సూపర్ జెయింట్స్ (LSG)కు ట్రేడ్ కావడంతో.. సన్‌రైజర్స్ బౌలింగ్ భారం మొత్తం అనుభవం లేని ఆటగాళ్లపై పడే ఛాన్స్ ఉందని అభినవ్ ముకుంద్ అన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ మధ్య వ్యత్యాసాన్ని ఎత్తిచూపాడు. ఎస్ఆర్హెచ్ టీమ్ బ్యాటింగ్ 10కి 10 పాయింట్స్ ఇస్తే.. బౌలింగ్ 10కి గానూ ఒకటి ఇవ్వడం బెటర్ అన్నాడు. 

ఎస్ఆర్హెచ్ కేవలం హైదరాబాద్ లోని ఫ్లాట్ పిచులపై మాత్రమే ప్రమాదకరంగా కనిపిస్తుంది.. కానీ పేలవమైన బౌలింగ్ తో ఈసారి టైటిల్ కొట్టే అవకాశం కనిపించడం లేదని మాజీ క్రికెటర్ అభినవ్ ముంకుద్ వెల్లడించారు. ప్రఫుల్ హింగే, ఓంకార్ తర్మలే, షకీబ్ హుస్సేన్ అనుభవం లేని ఆటగాళ్లను కొనుగోలు చేసింది.. వీరు ఎవరూ కూడా ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ మ్యాచ్ ఆడలేదు.. సీనియర్ ప్లేయర్స్ జయదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్ పేస్ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.. బౌలింగ్ లైనప్ లో అనుభవం లేని వాళ్లు ఉండటంతో జట్టుని కష్టాల్లోకి నెట్టి వేస్తుందని పేర్కొన్నారు. ఎస్ఆర్హెచ్ జట్టులో చాలా మంది ఫస్ట్ క్లాస్ జట్లలో చోటు సంపాదించుకోలేదని ఆరోపించారు.

 సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును చూసి నేను షాక్ అయ్యాను.. ఎస్ఆర్హెచ్ బాగా రాణించిన సీజన్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్ బాగా బౌలింగ్ చేశారని అభినవ్ ముకుంద్ అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడు హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్ ఈ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించే సమయం వచ్చిందన్నారు.  ఈ టీమ్ ఐపీఎల్ లో ఆడని చాలా మంది ఆటగాళ్లను ఎందుకు కొనుగోలు చేసిందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. వేలంలో చాలా డబ్బుని అనవసరంగా ఖర్చు పెట్టిందని ఆరోపించాడు.