కామారెడ్డి జిల్లాలో పిచ్చికుక్క దాడిలో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారులపై పిచ్చికుక్క ఒక్కసారిగా దాడి చేయడంతో తల, మెడ, ముఖంగా తీవ్ర గాయాలయ్యాయి. చికిత్సకోసం చిన్నారులను హైదరాబాద్ కు తరలించారు. వివరాల్లోకి వెళితే..
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతమాన్ పల్లిలో ఆదివారం( మార్చి22) పిచ్చికుక్క దాడిలో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు ఐదేళ్ల హర్షిణి, ఏడాదిన్నర వయసున్న జాహ్నవి ఇంటి ముందు ఆడుకుంటుండగా పిచ్చి కుక్క ఒక్కసారిగా వారిపై దాడి చేసింది. దీంతో చిన్నారుల ముంఖ, కంటి భాగం, శరీరంపై తీవ్రగాయాలయ్యాయి.
చికిత్సకోసం చిన్నారులను మొదట కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సకోసం ఇద్దరు చిన్నారులు హైదరాబాద్ కు తరలించారు.
గ్రామంలో వీధికుక్కల బెడద ఉందని ఎన్నిసార్లు పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వీధిలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.
