వీఆర్ఏల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా

వీఆర్ఏల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా

వీఆర్ఏలది అర్థం లేని ఆందోళన ఐతే... మీది నరంలేని నాలుకనా కేసీఆర్ అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.  వీఆర్ఏలకు  పే స్కేల్ ఇస్తాం, పదోన్నతులు ఇస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చింది కేసీఆర్ కాదా  అన్న రేవంత్ రెడ్డి... వీఆర్ఏల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి రెండేళ్లవుతున్నా ఇంకా నెరవేర్చలేదని ఆరోపిస్తూ.. వీఆర్ఏలు గత 41 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటివరకు 32మంది వీఆర్ఏలు చనిపోయినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  

ఇటీవల సీఎం కేసీఆర్ అసెంబ్లీ చేసిన ప్రకటన పైనా వీఆర్ఏలు మండిపడుతున్నారు. వీఆర్ఏలు అనవసరంగా ఆందోళనలు చేస్తున్నారని, అర్హులైన వారికి పే స్కేల్ ఇచ్చి వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తామన్న సీఎం వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలు ఈ రోజు తీవ్ర ఆందోళన చేపట్టారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన వీఆర్ఏలను పోలీసులు చెదరగొడుతున్నారు. దీంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.