హైదరాబాద్ అపార్ట్ మెంట్ లిఫ్ట్ లో ఇరుక్కుని బాలుడు మృతి

హైదరాబాద్ అపార్ట్ మెంట్ లిఫ్ట్ లో ఇరుక్కుని  బాలుడు మృతి

హైదరాబాద్: ఎల్బీనగర్ లోని ఆర్టీసీ కాలనీలో దారుణం జరిగింది. కొత్తగా నిర్మించిన భవనం లిఫ్ట్ లో ఇరుక్కొని బాలుడు మృతిచెందాడు. నూతనంగా నిర్మించిన భవనంలో వాచ్ మెన్ గా పనిచేస్తున్న నాగరాజు, అనురాధల కొడుకు అక్షయ్ లిఫ్ట్ సరిగ్గా పనిచేయకపోవడంతో అందులో ఇరుక్కొని తీవ్ర గాయాలపాలు కాగా.. చికిత్స ఆస్పత్రికి తరలించారు. అక్షయ్ చికిత్స పొందుతూ మృతిచెందాడు.దీంతో పోస్ట్ మార్టమ్ కు తరలించారు పోలీసులు. 

తన కుమారుడిని చూపించకుండా పోస్ట్ మార్టమ్ కు తరలించారని అక్షయ్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడి మృతదేహాన్ని చూపించకుండా ఎలా పోస్ట్ మార్టమ్ చేస్తారని ఆందోళనకు దిగారు. ఉప్పలాస్ రెసిడెన్సీ భవనంలోకి గత 20 రోజుల క్రితమే నాగరాజు, అనురాధ వాచ్ మెన్ గా కుదిరారు.. అప్పటివరకు ఎంతో చలాకీగా తిరిగిన కొడుకు ఒక్కసారిగా నిశ్చల స్థితిలో కనిపించడం తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. 

ALSO READ : షాకింగ్ నిజాలు : ఏ కులంలో ఎంత మంది పేదలు, ఎంత మంది ధనవంతులు