షాకింగ్ నిజాలు : ఏ కులంలో ఎంత మంది పేదలు, ఎంత మంది ధనవంతులు

షాకింగ్ నిజాలు : ఏ కులంలో ఎంత మంది పేదలు, ఎంత మంది ధనవంతులు

బీహార్ రాష్ట్రంలో కుల గణన, ఆయా కులాల్లోని పేదలు ఎంత మంది.. ధనవంతులు ఎంత మంది అనే విషయాలను వెల్లడించింది నితీష్ కుమార్ సర్కార్. ఇప్పటికే కుల గణను విడుదల చేసి... దేశానికి షాక్ ఇచ్చిన సర్కార్.. ఇప్పుడు ఏ కులంలో ఎంత పేదలు ఉన్నారు అనే విషయాలు వెల్లడించింది. 
బీహార్ రాష్ట్రంలో ఏయే కులాల్లో ఎంత మంది పేదలు, ధనవంతులు ఉన్నారు అనేది చూద్దాం...

బీహార్లో అగ్రవర్ణాలుగా కొనసాగుతున్న భూమిహార్ కులంలో 8లక్షల 38 వేల 447 కుటుంబాలుండగా.. 2లక్షల 31వేల 211 పేదలున్నారు. 

బీహార్ లో పేదరికం ఉన్న రెండో కులం బ్రాహ్మణకులం.. ఇందులో 10 లక్షల 76 వేల 563 కుటుంబాలుండగా.. అందులో 2లక్షల 72వేల 576 మంది పేదలున్నారు. 

మరోవైపు బీహార్ లో పేదరికంలో రాజ్పుత్ లు మూడో స్థానంలో ఉన్నారు. 6లక్షల 53వేల 447 మంది రాజ్ పుత్ కుటుంబాలుండగా.. 2లక్షల 37వేల 412 పేదలున్నారు. 

ఇక బీహార్ లో అత్యంత సంపన్నమైన కులం కాయస్థులు. మొత్తం లక్షా 70వేల 985 కాయస్థ కుటుంబాలుండగా.. వీరిలో 23వేల 639 కుటుంబాలు మాత్రమే పేదలున్నారు. 

బీహార్ లో షేక్, పఠాన్, సయ్యద్ అనే మూడు ముస్లిం కులాలు ఉన్నాయి. 

షేక్ కులంలో 10 లక్షల 38 వేల 88 కుటుంబాలుండగా.. 2 లక్షల 68వేల 398 పేద కుటుంబాలున్నాయి. 

పఠాన్ లలో 22.20 శాతం పేదలుండగా.. సయ్యద్ లలో 17.61 శాతం కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నాయి.