
ఆన్లైన్ గేమ్‌లు ప్రాణాలు తీస్తున్నాయి. పబ్ జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ మధ్య ఎంతో మంది చిన్నారులు ఈ గేమ్ బారిన పడి ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఆటలో గెలుపు ఓటములు సంగతి ఏమో కానీ దీని బారిన పడి చాలామంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు. సరదాగా మొదలుపెట్టిన ఈ గేమ్ షో వ్యసనంగా మారి అనేక మందిని విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేలా చేస్తుంది. చివరకు ప్రాణాల మీదకు తెస్తోంది. లేటెస్ట్ గా పబ్జి గేమ్ ఆడొద్దని తండ్రి మందలించినందుకు ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది
హైదరాబాద్ కు చెందిన భేతి సంతోష్ కుటుంబం భైంసాలో ఉంటూ చిరు వ్యాపారం చేసుకుంటున్నారు. ఆయన కుమారుడు రిషేంద్ర (13) విద్యార్థి 9వ తరగతి చదివి పబ్జికి బానిసయ్యాడు. పబ్జీ ఆడొద్దని తండ్రి మందలించగా ఇవాళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి వచ్చిన భైంసా పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భారత అంతర్గత సమాచారాన్ని దొంగిలిస్తున్నారనే కారణంతో చైనా యాప్ ల నిషేదించే క్రమంలో భారత ప్రభుత్వం 2020 సెప్టెంబర్‌లో దాదాపు రెండొందలకు పైగా యాప్‌లను బ్యాన్ చేసింది. వాటిలో పబ్జీ కూడా ఒకటి. పబ్జీకి చెందిన PUBG మొబైల్, PUBG లైట్‌లను నిషేధించారు. అయితే తర్వాత BGMI (బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా) పేరుతో భారత్ లో వస్తోంది.