V6 News

ఓయూలో స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం.. లేడీస్ హాస్టల్ సమీపంలో ఘటన

ఓయూలో స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం.. లేడీస్ హాస్టల్ సమీపంలో ఘటన
  • ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు
  • ప్రేమ వ్యవహారమే కారణమని సూసైడ్​ నోట్​

ఉప్పల్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. మహబూబ్​నగర్ జిల్లా గోవిందపురానికి చెందిన వినీష్ (19) ఓయూలో మైనింగ్ ఫస్టియర్ చదువుతున్నాడు. సోమవారం ఉదయం లేడీస్ హాస్టల్ సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన అతడిని ట్రీట్మెంట్ కోసం సికింద్రాబాద్​లోని గాంధీ దవాఖానకు తరలించారు. ఘటనా స్థలంలో అతడు రాసిన సూసైడ్​ నోట్​ను పోలీసులు గుర్తించారు. తాను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నాడు. గతంలోనూ వినీష్ పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, 70 శాతం కాలిన గాయాలతో వినీష్ చికిత్స పొందుతున్నాడు.