వీణవంక, వెలుగు: చదువుకోవడం ఇష్టం లేదని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన పోతరాజు భాస్కర్ కొడుకు రామచంద్ర(14), మండల కేంద్రంలోని ప్రైవేట్ స్కూల్ లో టెన్త్ చదువుతున్నాడు.
చదువుకోవడం ఇష్టంలేదని గత నెల 19న విద్యార్థి పురుగుల మందు తాగి వాంతులు చేసుకున్నాడు. ముందుగా జమ్మికుంట, కరీంనగర్ ఆస్పత్రులకు అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి హైదరాబాద్ లోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.
కొద్ది రోజుల కింద మళ్లీ రామచంద్ర అస్వస్థతకు గురికాగా కరీంనగర్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. చదువుకోవడం ఇష్టంలేకనే పురుగుల మందు తాగి తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి భాస్కర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు.
