ఎంసెట్‎లో ర్యాంకు తక్కువ వచ్చిందని విద్యార్థి సూసైడ్

ఎంసెట్‎లో ర్యాంకు తక్కువ వచ్చిందని విద్యార్థి సూసైడ్

నిర్మల్, వెలుగు: ఎంసెట్‎లో ర్యాంకు తక్కువ వచ్చిందని మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగింది. దివ్య నగర్ లో ఉండే  శ్రీకర్(19) ఇటీవల ఎంసెట్ ఎగ్జామ్ రాయగా, ఇంజనీరింగ్ విభాగంలో 17 వేల ర్యాంకు వచ్చింది. తనకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు రాదేమోననే మనస్తాపంతో బుధవారం అపార్ట్​మెంట్ లోని ఫ్లాట్ లో  చీరతో ఉరేసుకుని చనిపోయాడు. మృతుడి తల్లిదండ్రులు ఆస్ట్రేలియాలో ఉంటుండగా.. ఇక్కడ అతడు తన బంధువుల వద్ద ఉంటున్నాడు.  టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.