కంప్యూటర్ తప్పా , మనుషులది తప్పా : నీట్ ఎగ్జామ్ లో పాస్..కానీ ప్రాణం తీసుకున్న విద్యార్ధిని

కంప్యూటర్ తప్పా , మనుషులది తప్పా : నీట్ ఎగ్జామ్ లో పాస్..కానీ ప్రాణం తీసుకున్న విద్యార్ధిని

కంప్యూటర్ తప్పిదమో, మానవ తప్పిదమో ఓ విద్యార్ధి జీవితాన్ని బలితీసుకుంది.

వైద్య విద్యను చదవాలనుకునే విద్యార్ధులు తప్పని సరిగా  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంది. ఆ ఎంట్రన్స్ టెస్ట్ లో ఉత్తర్ణత సాధించిన విద్యార్ధులు వైద్య  విద్యను అభ్యసించవచ్చు. ఇందుకు సంబంధించి కరోనా వైరస్ విపత్తులో సైతం సెప్టెంబర్ 13న నీట్ పరీక్షలు ముగిశాయి. ఈ పరీక్షకు  15.97 లక్షల మంది అభ్యర్థులలో 85-90 శాతం మంది  పరీక్షకు హాజరయ్యారు. మహమ్మారి కారణంగా సెప్టెంబర్ 13 న పరీక్షలకు హాజరు కాని దాదాపు 300 మంది అభ్యర్థులు అక్టోబర్ 14 న పరీక్ష రాశారు

నీట్ ఫలితాలు  అక్టోబర్ 16 న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) ప్రకటించింది. ఈ పరీక్షల్లో  ఒడిశా కు చెందిన  సోయెబ్ అఫ్తాబ్ తో పాటు ఢిల్లీకి చెందిన అకాన్షా సింగ్  720 మార్కుల్లో 720 మార్కులు సాధించి చరిత్ర సృష్టించారు.

అయితే  చిన్నతనం నుంచి డాక్టర్ కావాలని కలలుగన్న మధ్యప్రదేశ్ కు చెందిన విద్యార్ధిని సూర్యవంశీ నీట్ ఎగ్జామ్ రాసింది. క్వాలిఫై అయ్యింది. కానీ నీట్ ఫలితాల్లో బాధితురాలు క్వాలిఫై కాలేదని రిజల్ట్ వచ్చాయి. డాక్టర్ అవ్వాలనే కల కలగానే మిగిలిపోతుందని ఆందోళనకు గురైన బాధితురాలు ఇంట్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్ బాడీని ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కాగా బాధితురాలి కుటుంబసభ్యులు సైతం సూర్యవంశీకి వచ్చిన మార్కుల్ని నమ్మలేదు. ఎక్కడో ఏదో తప్పు జరిగిందని భావించి ఓఎంఆర్ షీర్ చెక్ చేయగా అందులో ఆమెకు 590మార్కులతో అర్హత సాధించింది. కంప్యూటర్ తప్పిదమో లేదంటే  మానవ తప్పిదం వల్ల తమ కుమార్తె అన్యాయంగా తమను విడిచి పెట్టి వెళ్లిందంటూ గుండెలవిసేలా కన్నీరు మున్నీరవుతున్నారు.