కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థి మృతి

కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థి మృతి

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిలాపూర్ సమీపంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో కార్తీక్ (12) అనే మూడో తరగతి విద్యార్థి మృతి చెందాడు. పదిహేను రోజుల క్రితం భుజానికి తీవ్ర గాయం కావడంతో కార్తిక్ అస్వస్థతకు గురయ్యాడు. ఈ విషయాన్ని నాలగు రోజుల క్రితమే  యాజమాన్యం, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో.. వారు తమ కుమారున్ని ఇంటికి తీసుకెళ్లారు. అనంతంరం ఆస్పత్రి తరలించగా.. చికిత్స పొందుతూ కార్తీక్ మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనకు కారణం స్కూల్ యాజమాన్యమే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారి నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడంటూ చెన్గోమల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యజమాన్యం మాత్రం కార్తిక్ బెడ్ పై నుంచి పడడంతో గాయాలయ్యాయని, ఆ తర్వాత అతని పేరెంట్స్ వచ్చి కార్తిక్ ను ఇంటికి తీసుకు వెళ్లారని చెబుతున్నారు. ఆ తర్వాత మృతి చెందాడని కేశవరెడ్డి పాఠశాల యజమాన్యం వాదిస్తోంది.  

ఈ నేపథ్యంలో కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. చనిపోయిన విద్యార్థికి మరోసారి వైద్య పరిక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేస్తూ.. స్కూల్ ప్రధాన గేటు తాళం పగలగొట్టి యువజన కాంగ్రెస్ నాయకులు లోపలికి దూసుకెళ్ళే ప్రయత్నం చేశారు.