
చిన్నారుల పాలిట మృత్యు శకటాలుగా మారుతున్నాయి స్కూలు బస్సులు. దీనికి డ్రైవర్ల నిర్లక్ష్యం తోడు కావడంతో చిన్నారులు మృత్యు బారిన పడుతున్నారు.
నిన్న(శుక్రవారం) హైదరాబాద్ లోని నంది హిల్స్ కాలనీకి చెందిన గణేష్ అనే ఏడేళ్ల బాలుడు స్థానికంగా ఉన్న శ్రీవిద్యా హై స్కూల్లో 1వ తరగతి చదువుతున్నాడు ఉదయం బాలుడి తండ్రి బాలు నాయక్ స్కూల్ దగ్గర వదలి వచ్చి సాయంత్రం తిరిగి తీసుకెళ్లేందుకు రాకపోవడంతో…ఆ బాలుడు నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా స్పీడ్ గా వచ్చిన వాటర్ ట్యాంకర్ వచ్చి ఢీకొనడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు ప్రమాదానికి కారణమైన ట్యాంకర డ్రైవర్ ఆంజనేయులు పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.