చర్చిలకు స్థలాలు ఇస్తాం..రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్

చర్చిలకు స్థలాలు ఇస్తాం..రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్

నిర్మల్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్రిస్టియన్ల కోసం చర్చిల నిర్మాణం చేపడతామని, ఇందుకు స్థలాలను సైతం కేటాయిస్తామని  రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ తెలిపారు. 

శుక్రవారం నిర్మల్ కలెక్టరేట్ లో క్రైస్తవ మైనార్టీ సమస్యలపై కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని క్రైస్తవులు అభివృద్ధి చెందాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి తగిన సిఫారసులను ప్రభుత్వానికి పంపుతామని ఆయన హామీ ఇచ్చారు.