
సత్తుపల్లి, వెలుగు : ఫొటోగ్రాఫర్ల కుటుంబాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి హామీ ఇవ్వడంతో సత్తుపల్లి ఫొటోగ్రాఫర్స్ యూనియన్ నాయకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నార్సింగ్ లోని ఓం కన్వెన్షన్ హాల్ లో ఫొటోగ్రఫీ వర్క్ షాప్ ను ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి వివేక్ ప్రారంభించారు.
రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్, వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి వివేక్ మాట్లాడుతూ ఫొటోగ్రఫీ యూనియన్ లో కుటుంబ భరోసా పథకం బాగుందని, త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అర్హులైన ఫొటోగ్రాఫర్లకు ఐడీ కార్డ్స్ పంపిణీ చేస్తామన్నారు. పేద ఫొటోగ్రాఫర్ల పిల్లల చదువులకు తమ వంతు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో సత్తుపల్లి యూనియన్ నాయకులు ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సత్తుపల్లి మండల అధ్యక్షుడు పాషా, కార్యదర్శి రాంబాబు, మూర్తి, సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కనకారావు, కార్యదర్శి మల్లికంటి సుమాంజలి రాము తదితరులు పాల్గొన్నారు.