కెమెరాలు, మొబైల్ ఫోన్లపై జీఎస్టీ తగ్గింపునకు కేంద్రమంత్రికి లెటర్ రాస్తా : మంత్రి వివేక్ వెంకటస్వామి

కెమెరాలు, మొబైల్ ఫోన్లపై జీఎస్టీ తగ్గింపునకు కేంద్రమంత్రికి లెటర్ రాస్తా : మంత్రి వివేక్ వెంకటస్వామి
  • 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించేందుకు కృషి చేస్తా: మంత్రి వివేక్ వెంకటస్వామి  
  • నార్సింగిలో తెలంగాణ ఫొటో ట్రేడ్ ఎక్స్ పో  ప్రారంభం

నార్సింగి, వెలుగు: కెమెరాలు, మొబైల్ ఫోన్లపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లెటర్​రాస్తానని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి వివేక్​వివేక్​వెంకటస్వామి అన్నారు. నార్సింగిలోని ఓం కన్వెన్షన్ హాల్​లో తెలంగాణ ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న హైదరాబాద్ ఫొటో ట్రేడ్ ఎక్స్ పో –2025 ను మంత్రి వివేక్​ వెంకటస్వామి శుక్రవారం ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ఫొటోగ్రాఫర్స్ ది కీలక పాత్ర అని పేర్కొన్నారు. 

పాలిటిక్స్, పెళ్లిళ్లు, ఈవెంట్స్ అన్నీ కెమెరామెన్లు, వీడియోగ్రాఫర్లు లేకుండా జరగడం లేదన్నారు. కరోనా​టైంలో 143 కుటుంబాలను అసోసియేషన్ ఆదుకుని మంచి పని చేసిందని అభినందించారు. ఫొటోగ్రాఫర్స్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ పొందేందుకు అసోసియేషన్ కృషి చేస్తున్న విధానాన్ని ప్రశంసించారు. ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ బిల్డింగ్, ఐడెంటిటీ కార్డుల విషయమై సీఎంతో చర్చిస్తానని.. ఫొటోగ్రాఫర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇన్సూరెన్స్ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకురావడానికి కృషి చేస్తానని వెల్లడించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 46 అడ్వాన్సుడ్​ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా ట్రైనింగ్ కోర్సులు అందుబాటులోకి రాబోతున్నాయని చెప్పారు. 

పెద్దపల్లిలో ఫొటోగ్రాఫర్స్ కోసం ఎంపీ ల్యాడ్​ఫండ్ ద్వారా రూ.10 నుంచి -15 లక్షల నిధులు విడుదల చేయిస్తానన్నారు. ఈ సందర్బంగా 200 పైగా ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయగా, మంత్రి సందర్శించి లేటెస్ట్​ఎక్విప్​మెంట్​ను పరిశీలించారు.  ఖానాపూర్​ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, భవన నిర్మాణాల కార్పొరేషన్​ చైర్మన్​ మల్ రెడ్డి రాంరెడ్డి పాల్గొన్నారు.