
- ఎగ్జామ్ రాసి ఆన్సర్ పేపర్‌తో ఇంటికి!
- తప్పిదం గుర్తించి బోర్డుకు ఇచ్చి వచ్చిన టెన్త్విద్యార్థి
- విత్‌హెల్డ్‌లో రిజల్ట్స్ న్యాయం చేయాలని వేడుకోలు
మునిపల్లి, వెలుగు : ఈ ఏడాది జరిగిన ఎస్సెస్సీ ఎగ్జామ్స్ రాసిన ఓ విద్యార్థి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఇన్విజిలేటర్, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ నిర్లక్ష్యం, విద్యార్థి తప్పిదంతో మొన్న వెలువడిన ఫలితాల్లో అతడి హాల్‌టికెట్ నంబర్ విత్ హెల్డ్‌లో వచ్చింది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మల్లికార్జున్ పల్లి జడ్పీహెచ్ఎస్ స్కూల్‌కు చెందిన పడమటి మల్లికార్జున్తన పదో తరగతి పరీక్షలను మునిపల్లి మోడల్ స్కూల్ లో రాశాడు. బయోలాజికల్ సైన్స్ పేపర్ ఎగ్జామ్రాసిన తర్వాత ఆన్సర్ పేపర్ కట్టి ఇచ్చి రావాల్సింది పోయి క్వశ్చన్ పేపర్ కట్టి ఇన్విజిలేటర్‌కు ఇచ్చి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత గమనించిన స్టూడెంట్ తన స్కూల్ టీచర్ల దృష్టికి తీసుకెళ్లాడు. వారి సలహా మేరకు మరుసటి రోజు ఆన్సర్ పేపర్‌ను ఎగ్జామ్ సెంటర్ కు తీసుకెళ్తే హైదరాబాద్‌లోని బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌కు తీసుకెళ్లాలని చెప్పారు.
దీంతో వారు చెప్పినట్టే హైదరాబాద్ వెళ్లి ఇచ్చి వచ్చాడు. ఈ నెల10వ తేదీన ఫలితాలు వెలువడగా అందులో మల్లికార్జున్ హాల్టికెట్నంబర్ విత్ హెల్డ్‌లో వచ్చింది. ఇప్పుడు తనను పాస్ చేస్తారో..ఫెయిల్ చేస్తారో తెలియక కంగారు పడుతున్నాడు. తనకు న్యాయం చేసి భవిష్యత్ అంధకారం కాకుండా చూడాలని వేడుకుంటున్నాడు. ఈ విషయమై ఎగ్జామ్ సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ కిష్టయ్యను వివరణ కోరగా సైన్స్పేపర్కు సంబంధించి రెండు పేపర్లు ఒకే రోజు రావడంతో స్టూడెంట్ రాసిన పేపర్ ను సరిగ్గా చూడలేకపోయామని చెప్పారు.