
ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు కారణమైన గ్లోబరీనాపై చర్యలు తీసుకోవాలంటూ ఓ యువకుడు వినూత్న నిరసన చేపట్టాడు. ఛత్రపతి శివాజీ వేషంలో కోట శ్యాంకుమార్ అనే యువకుడు.. కరీంనగర్ కలెక్టరేట్ ముందు బైఠాయించాడు. గ్లోబరీనా తప్పిదాలతోనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించిన శ్యాంకుమార్.. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు గ్లోబరీనా సంస్థ నుంచి పరిహారం ఇప్పించాలన్నాడు శ్యాంకుమార్.