
- ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పిడిఎస్ యు విద్యార్థి సంఘాల పిలుపు
ఖమ్మం టౌన్, వెలుగు: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని నేడు జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలని విద్యార్థి సంఘాల నేతలు కోరారు. సుందరయ్య భవనంలోని ఎస్ఎఫ్ఐ జిల్లా ఆఫీసులో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి. ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శులు మస్తాన్, వెంకటేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లోని సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో స్టూడెంట్స్ అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సుధాకర్, పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మధు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాజు, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు వరుణ్, వినోద్, త్రినాథ్, లోకేశ్ పాల్గొన్నారు.