
ఓయూ, వెలుగు: ఈ నెల చివరివారంలో జరగనున్న టీఎస్ సెట్ పరీక్షను వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు కోరాయి.ఈ మేరకు ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్లక్ష్మినారాయణకు సోమవారం వినతి పత్రం అందజేశాయి. గ్రూప్– 2 పరీక్షలు నవంబరు ఫస్ట్ వీక్ లో ఉండగా, టీఎస్సెట్పరీక్షల కారణంగా ఏండ్లుగా చదువుతున్న స్టూడెంట్లు తీవ్రంగా నష్టపోతారని విద్యార్థి సంఘాల నేతలు పేర్కొన్నారు.
ఇందుకు సానుకూలంగా స్పందించిన రిజిస్ట్రార్ పరీక్ష వాయిదా కోసం సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు విద్యార్థి సంఘాల నేతలు రవి నాయక్, ఆంజనేయులు, శ్రీను, వికాస్ తెలిపారు.