పి.శ్రీనివాస్ పై దాడి చేసిన ఎస్ఐ, కానిస్టేబుల్ నుసస్పెండ్ చేయాలి

పి.శ్రీనివాస్ పై దాడి చేసిన ఎస్ఐ, కానిస్టేబుల్ నుసస్పెండ్ చేయాలి
  • ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల డిమాండ్
  • తాండూరు డీఎస్పీకి వినతిపత్రం

తాండూర్ ,వెలుగు :  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పీడీఎస్ యూ అధ్యక్షుడు పి.శ్రీనివాస్ పై దాడికి పాల్పడిన తాండూరు టౌన్ పీఎస్ ఎస్ఐ కాశీనాథ్, కానిస్టేబుల్ సత్తార్ ను వెంటనే సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు ,విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం డీఎస్పీ బాలకృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. 

అనంతరం ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు నేతలు మాట్లాడుతూ..  విద్యార్థి సంఘ నేతపైనే పోలీసులు దాడికి పాల్పడితే.. ఇక ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఘటనపై పోలీసులు స్పందించకపోవడం దేనికి నిదర్శనమని మండిపడ్డారు. ఎస్ఐ, కానిస్టేబుల్ సస్పెండ్ చేయకుంటే జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు.  సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె. శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిత్, తదితర నేతలు ఉన్నారు.