ఎన్‌‌టీఏ చైర్మన్‌‌ రాజీనామా చేయాలని ఎంపీ గొడం నగేశ్‌ ఇంటి ముట్టడి

ఎన్‌‌టీఏ చైర్మన్‌‌ రాజీనామా చేయాలని ఎంపీ  గొడం నగేశ్‌ ఇంటి ముట్టడి

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: నీట్‌‌లో అవకతవకలు జరిగినందున ఎన్‌‌టీఏ చైర్మన్‌‌ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఆదిలాబాద్‌‌లో ఎంపీ గొడం నగేశ్‌‌ ఇంటిని ముట్టడించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న పోలీసులకు, విద్యార్థి నాయకులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్‌‌ చేసి స్టేషన్‌‌కు తరలించారు. 

ఈ సందర్భంగా ఎన్‌‌ఎస్‌‌యూఐ జిల్లా అధ్యక్షుడు రంగినేని శాంతన్‌‌రావు మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో కేంద్రప్రభుత్వం ఆటలు ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలు జరిగిన నీట్‌‌ ఎగ్జామ్‌‌ను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్‌‌ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌‌యూ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్.వెంకటేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మడావి గణేశ్, ఎస్‌‌ఎఫ్‌‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు సీహెచ్‌‌.దిగంబర్‌‌, నాయకులు వి.మహేందర్, ఎర్రాజి హరీశ్, దత్తు, మెస్రం మారుతి, కపిల్, అవినాశ్‌‌ పాల్గొన్నారు.