
- రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నం
ఓయూ, వెలుగు: ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కోర్సును రద్దు చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో స్టూడెంట్లు సోమవారం ఓయూ అడ్మినిస్ట్రేటివ్బిల్డింగ్ముందు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ నాయకులు మాట్లాడుతూ.. నిజాం కాలేజీలో ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కోర్సుకు మంచి ఆదరణ ఉందని.. దాన్ని రద్దు చేయాలనే అధికారులు నిర్ణయం సరికాదన్నారు.
గ్రామీణ ప్రాంత స్టూడెంట్లకు ఉన్నత విద్యను మరింత దగ్గర చేయాల్సిన అధికారులు దానికి విరుద్ధంగా.. డిమాండ్ఉన్న కోర్సులను రద్దు చేయడం అన్యాయమన్నారు. ఆ కోర్సును పునరుద్ధరిస్తూ తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ రాజేందర్ నాయక్ కు వినతిపత్రం అందజేశారు. ఈ ఆందోళనలో పీడీఎస్యూ నాయకులు సుమంత్, కోటేశ్, నందిని, సాత్విక తదితరులు పాల్గొన్నారు.