ప్రభుత్వ హాస్టల్ లో కొట్టుకున్న విద్యార్థులు

ప్రభుత్వ హాస్టల్ లో కొట్టుకున్న విద్యార్థులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. పాల్పంచ బొలోరిగూడెంలోని ప్రభుత్వ బాలుర హాస్టల్ లో విద్యార్థులు వీరంగం సృష్టించారు. హాస్టల్ లో చెడు వ్యసనాలకు బానిసలయ్యారని భావిస్తున్న కొందరు విద్యార్థులు ఒక బ్యాచ్ గా ఏర్పడి.. ఇతర విద్యార్థులపై దాడికి దిగారు. హాస్టల్ వార్డెన్, సిబ్బంది అక్కడే ఉన్నారనే విచక్షణ కూడా లేకుండా కొట్టుకున్నారు. విద్యార్థుల వీరంగం ఎంతకూ ఆగకపోవడంతో అక్కడి వారు పోలీసులకు సమాచారం అందజేశారు. హాస్టల్ కు వచ్చిన పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు.

హాస్టల్ లోని కొందరు విద్యార్థులు మద్యం సేవిస్తున్నారని, సిగరెట్లు తాగుతున్నారని.. ఈ విషయాన్ని ఒక వర్గం విద్యార్థులు బహిర్గతం చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇలాగే కొనసాగితే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని భయపడుతున్నారు. హాస్టల్ లో జరిగిన కోట్లాట గురించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు పేరెంట్స్.

కొందరు విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కావటం వాస్తవమేనన్నారు.. హాస్టల్ వార్డెన్ రాజ్యలక్ష్మి. విద్యార్థులు రెండు బ్యాచ్ లుగా విడిపోయి కొట్టుకున్నారని చెప్పారు. ఈ విషయాన్నీ ఇవాళే తన దృష్టికి వచ్చాయని.. బాధ్యులైన విద్యార్ధులపై క్రమశిక్షలు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పేరుకే హైదరాబాద్.. లోకల్ ప్లేయర్ లేకుండానే బరిలోకి..