చెరువులో పడి నలుగురు విద్యార్థులు మృతి

చెరువులో పడి నలుగురు విద్యార్థులు మృతి

కోదాడ : పుట్టినరోజు పార్టీ నాలుగు కుటుం బాల్లో విషాదాన్ని నింపింది. చెరువులో మునిగి నలుగురు డిప్లొమా స్టూడెంట్స్​ మృతిచెందిన సంఘటన కోదాడలో బుధవారం చోటుచేసుకుంది. కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న చక్రాల ప్రవీణ్ తన బర్త్​డేను 15 మంది స్నేహితులతో కలిసి కోదాడలోని పెద్ద చెరువు కట్టమీద గల గుడి వద్ద చేసుకున్నా రు. పార్టీ తర్వాత చెరువులో చేతులు కడుక్కునేం దుకు సమీర్ చెరువు వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. అతన్ని రక్షించే క్రమంలో మరో ఇద్దరు చెరువులోకి దిగారు. లోతు ఎక్కు వగా ఉండడంతో చక్రాల ప్రవీణ్(18), హుజూర్ నగర్ కు చెందిన భవాని ప్రసాద్(17), నేరేడుచర్లకు చెందిన సమీర్(17), ఖమ్మం జిల్లా పైనంపల్లికి చెందిన మహీందర్ (17) మృతిచెందారు. ఈ సంఘటనతో భయపడిన

మిగిలిన స్టూడెంట్స్​ అక్కడి నుంచి పరారయ్యారు. వీళ్లంతా డే స్కా లర్స్. డిప్లొమా సివిల్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది చెరువులో నుంచి నలుగురి తదేహాలను వెలికితీశారు. తల్లిదండ్రుల రోదనతో ఆ ప్రాంతం మొత్తం విషాదం అలముకుంది. పుట్టినరోజు నాడే ప్రవీణ్ మృతిచెందడం తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెలవిసేలా వారు రోదిం చడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఈ రోజు ఉదయమే పుట్టిన రోజు శుభాకాంక్ష లు చెప్పానని, అంతలోనే ఇలా జరుగుతుందని ఊహిం చలేదని తండ్రి విలపించారు.