- డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ ..
డాక్టర్ జి.సరోజా వివేక్
ముషీరాబాద్, వెలుగు: విద్యార్థుల సమగ్రాభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ డాక్టర్ జి.సరోజా వివేక్ అన్నారు. విద్యార్థులకు న్యాయమైన విద్యనందించేందుకు లెక్చరర్లు ఆధునిక బోధనా విధానాలను అవలంబించాలని సూచించారు.
గురువారం బాగ్ లింగంపల్లి లోని అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో 2026–-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ యాక్షన్ ప్లాన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ప్రతిభను గుర్తించి, వారికి అవసరమైన అకాడమిక్ గైడ్లైన్స్అందించాలని చెప్పారు.
అకాడమిక్ యాక్షన్ ప్లాన్ ఎలా అమలు చేయాలో సీఈవో ప్రొఫెసర్ లింబాద్రి వివరించారు. అనంతరం అంబేద్కర్ డిగ్రీ అటానమస్ రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను కరస్పాండెంట్ సరోజా వివేక్ విడుదల చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, లెక్చరర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
