చదువు చెప్పిన ఉపాధ్యాయురాలు బదిలీపై మరో జిల్లాకు వెళ్తుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. గత 9 ఏళ్లుగా జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం సిరిపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రత్నమాల ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహించారు.
317 జీవో కారణంగా మహబూబాబాద్ జిల్లాకు ఉపాధ్యాయురాలు రత్నమాల బదిలీ అయ్యారు. అయితే ఇన్నేళ్ళుగా చదువు చెప్పిన పంతులమ్మ వేరే చోటుకు బదిలీపై వెళ్తుండటంతో పాఠశాల విద్యార్దులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
