హాస్టల్ భోజనంలో పురుగులు..కస్తూర్బాగాంధీ పాఠశాల విద్యార్థుల ఆందోళన

హాస్టల్ భోజనంలో పురుగులు..కస్తూర్బాగాంధీ పాఠశాల విద్యార్థుల ఆందోళన

ఆదిలాబాద్ జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు బుధవారం (సెప్టెంబర్ 10) ఆందోళనకు దిగారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనంలో నాణ్యత లోపిస్తోందని, తరచూ అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆరోపించారు. భోజనం నాణ్యతపై అనేకసార్లు సమస్యలు ఎదురవుతున్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల భోజనంలో పదేపదే పురుగులు రావడంతో విసిగిపోయిన విద్యార్థులు భోజనపు ప్లేట్లు పట్టుకుని నిరసన తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ లో బుధవారం(సెప్టెంబర్ 10) కస్తూర్బాగాంధీ పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. పాఠశాలలో విద్యార్థునిలకు వడ్డించే భోజనంలో పురుగులు రావడంతో ప్లేట్లలో భోజనం పట్టి చూపిస్తూ స్కూల్ లో నిరసన తెలిపారు. గతంలో చాలాసార్లు ఇలా భోజనంలో పురుగులు వచ్చాయని.. విద్యార్థులకు వడ్డించే భోజనం విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. 

►ALSO READ | పేదలకు అండగా కాంగ్రెస్ సర్కార్..ఇచ్చిన మాట ప్రకారమే ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి వివేక్ వెంకటస్వామి