తైక్వాండో పోటీల్లో సత్తా చాటిన.. సాయికామ్ స్పోర్ట్స్ అకాడమీ స్టూడెంట్లు

తైక్వాండో పోటీల్లో సత్తా చాటిన.. సాయికామ్ స్పోర్ట్స్ అకాడమీ స్టూడెంట్లు

గండిపేట, వెలుగు : గత నెల‌‌ 30, 31 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా రేపల్లెలో జరిగిన తొలి చిట్ఫ్ నేషనల్‌‌ తైక్వాండో చాంపియన్ షిప్ –2023 పోటీల్లో మణికొండలోని సాయికామ్‌‌ ఇంటర్నేషనల్ తైక్వాండో స్పోర్ట్‌‌ అకాడమీకి చెందిన స్టూడెంట్లు సత్తా చాటారు. బోదిధర్మ మార్షల్‌‌ ఆర్ట్స్‌‌ అకాడమీ ఈ చాంపియన్‌‌షిప్​ను నిర్వహించగా.. సీనియర్‌‌ మాస్టర్‌‌ కె. వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఎస్‌‌. సుబ్బారావు పర్యవేక్షణలో పోటీలు జరిగాయి. 

బ్లాక్‌‌ బెల్ట్‌‌ బాలికలు, బాలుర గ్రూప్‌‌లు తుల్స్‌‌ అండ్‌‌ స్పేరింగ్‌‌ కలిసి 25 గోల్డ్‌‌ మెడల్స్‌‌ సాధించారు. బ్లాక్‌‌ బెల్ట్‌‌ గర్ల్స్‌‌ ఇండివిజువల్‌‌ తుల్స్​​లో 61 గోల్డ్‌‌ మెడల్స్‌‌ సాధించారు.  కలర్‌‌ బెల్ట్‌‌ గర్ల్స్‌‌ గ్రూప్‌‌ తుల్స్‌‌ ఆరు గోల్డ్ మెడల్స్ సాధించారు.  వీటితో పాటు ఆరు సిల్వర్, 12 బ్రాంజ్‌‌ మెడల్స్​ను స్టూడెంట్లు దక్కించుకు
న్నారు. గోల్డ్‌‌, సిల్వర్ మెడల్ విజేతలు ఈ నెల 8 నుంచి10వ తేదీ వరకు నేపాల్‌‌లో జరిగే తొలి ఏషియా తైక్వాండో చాంపియన్‌‌షిప్‌‌కు అర్హత సాధించినట్లు  సాయికామ్ ఇంటర్నేషనల్ తైక్వాండో స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు తెలిపారు.