విద్యార్థులకు శుభవార్త.. ఎగ్జామ్స్ లేకుండానే  ప్రమోట్

విద్యార్థులకు శుభవార్త.. ఎగ్జామ్స్ లేకుండానే  ప్రమోట్

డిగ్రీ, పీజీ పరీక్షలపై ఉన్నత విద్యా మండలి గైడ్​లైన్స్

హైదరాబాద్, వెలుగు: లాక్​డౌన్ వల్ల​వాయిదా పడ్డ పీజీ, డిగ్రీ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి క్లారిటీ ఇచ్చింది. జూన్​20 నుంచి ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించుకోవాలని సూచించింది. మిగిలిన సెమిస్టర్ల ఎగ్జామ్స్ ను​​నవంబర్, డిసెంబర్ లో పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. బ్యాక్ లాగ్​తో సంబంధం లేకుండా స్టూడెంట్స్ ను ప్రమోట్ చేయాలని సూచించింది. శుక్రవారం అన్ని వర్సిటీలకు 2019–20 ఎగ్జామ్స్​ గైడ్​లైన్స్​ను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి రిలీజ్ చేశారు. పరీక్షా సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలకు కుదించాలని సూచించారు. మొత్తం సిలబస్​ను కవర్ చేయాలని, ప్రశ్నాపత్రంలో ఎక్కువ ఛాయిస్​లు ఇవ్వాలని గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు. ప్రతి రెండు సెషన్స్​లో పరీక్షలు నిర్వహించా లని, ఒక సెషన్​లో బీకాం, మరో సెషన్​లో బీఏ, బీఎస్సీ స్టూడెంట్స్ కు ఎగ్జామ్స్​పెట్టాలన్నారు. ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్ ను కాలేజీలే నిర్వహించుకోవాలని సూచించారు.

For More News..

ఎల్లుండి నుంచి జీవన్‌దాన్ సర్జరీలు

లాక్డౌన్ వల్ల ఆన్‌లైన్‌లోకి ఫిట్​నెస్ క్లాసులు

తల్లిదండ్రులు భార్యను వేధిస్తున్నారని.. ఆమెతో కలిసి సూసైడ్ చేసుకున్న భర్త

కరోనా గురించి మామను కోల్పోయిన అల్లుడి సోషల్ మీడియా పోస్ట్