
- ఎగ్జామినేషన్ బ్రాంచ్పైవిచారణ చేయండి
- స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం డిమాండ్
కూకట్పల్లి, వెలుగు: జేఎన్టీయూ ఎగ్జామినేషన్బ్రాంచ్పై వస్తున్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని జేఎన్టీయూ స్టూడెంట్స్ప్రొటెక్షన్ ఫోరం డిమాండ్ చేసింది. ఈ మేరకు వర్సిటీ వీసీ కిషన్కుమార్రెడ్డిని సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫోరం నాయకులు రాహుల్ నాయక్, తనూజ్ కుమార్ మాట్లాడుతూ.. ఎగ్జామినేషన్బ్రాంచ్పై అనేక ఆరోపణలు వస్తున్నాయని, దీని వల్ల వర్సిటీ పరువు పోతుందన్నారు. వర్సిటీ విశ్వసనీయత నిరూపించుకోవాలంటే అన్ని రకాల ఆరోపణలపై విచారణ చేపట్టి వాస్తవాలు బయటపెట్టాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు పిల్లి సిద్ధార్థ, సాగర్ నాయక్, దుర్గాప్రసాద్, ఆనంద్, జయరాం, సంతోశ్, నితిన్ కుమార్, సిరి, జవ్వాజి దిలీప్ ఉన్నారు.