మా వాళ్లు సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు : కవిత

మా వాళ్లు సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు : కవిత

తనపై  హరీశ్, సంతోష్ , బీఆర్ఎస్  సోషల్ మీడియా దాడి చేస్తోందని  తెలంగాణ  జాగృతి అధ్యక్షురాలు కవిత  విమర్శించారు. పార్టీలో తనకు  జరిగిన ఇబ్బందులపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో  తెల్వదన్నారు.అయితే బీఆర్ఎస్ లో  అందరూ నన్ను  ఇబ్బందులు పెట్టారని తెలంగాణ ప్రజలు  భావిస్తున్నారని చెప్పారు. 

మళ్లీ రాజీనామా చేస్తా

తన   రాజీనామాను స్పీకర్ ఫార్మాట్ లో చేశానని అన్నారు కవిత.  స్పీకర్ కు ఫోన్ చేసి కూడా ఆమోదించమని అడిగానని చెప్పారు. అవసరమైతే మళ్ళీ రాజీనామా లేఖను పంపిస్తానని తెలిపారు.

ALSO READ : తుమ్మిడిహెట్టిపై హరీశ్ చెప్పేవన్నీ అబద్ధాలే

తీన్మార్ మల్లన్న పార్టీ పై

తెలంగాణ లో కొత్త రాజకీయ పార్టీలు వస్తే స్వాగతిస్తామన్నారు కవిత. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీలు పెట్టుకునే హక్కు ఉందన్నారు. అందరం కలిసి బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి. బీసీ రిజర్వేషన్లను సాధించుకోవాలని సూచించారు.  తీన్మార్ మల్లన్న తో కలిసి పని చేస్తారా? అనే ప్రశ్నకు జై తెలంగాణ అంటూ దాట వేశారు కవిత. తీన్మార్ మల్లన్న పర్సనల్ కామెంట్స్ చేస్తే స్పందించను.. నిర్మాణ పరమైన అంశాలపై స్పందిస్తానని తెలిపారు. బీసీల  కోసం కోట్లాడుతున్నాం..ముందు రిజర్వేషన్ ల ను సాధించుకుందామని అన్నారు కవిత.