పెద్దపల్లి, వెలుగు : స్వాతంత్ర్య దినోత్సవాన నాణ్యమైన తిండి కోసం హాస్టల్విద్యార్థులు రోడ్డెక్కారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని బాలుర హాస్టల్లో మంగళవారం ఇండిపెండెన్స్‌డే సెలబ్రేషన్స్‌కు విద్యార్థులు సిద్ధమవుతుండగా ఉదయం పాలు , బాదుషా పెట్టారు. జెండా ఆవిష్కరణ తర్వాత మధ్యాహ్నం టైంలో ఇడ్లీ పెట్టారు. వాటిని తినగా వాసన రావడంతో ఇడ్లీ ప్లేట్లతోనే మంథని చౌరస్తాలో బైఠాయించి ధర్నాకు దిగారు.
వీరికి పలు విద్యార్థి సంఘాలు సంఘీభావం తెలపడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. సర్ధి చెప్పడంతో స్టూడెంట్స్హాస్టల్కు వెళ్లారు. తర్వాత అధికారులు హాస్టల్‌ను తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో నాణ్యమైన తిండి పెట్టడం లేదని అధికారులకు చెప్పారు. ఫుడ్బాగా లేదని చెబితే సిబ్బంది బెదిరిస్తున్నారని విద్యార్థులు చెప్పడంతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
