ఇస్రో SACలో అప్రెంటిస్ ఉద్యోగాలు.. ఐటీఐ, డిప్లొమా, బీటెక్ చేసిన వారికి అద్భుత అవకాశం!

ఇస్రో SACలో అప్రెంటిస్ ఉద్యోగాలు.. ఐటీఐ, డిప్లొమా, బీటెక్ చేసిన వారికి అద్భుత అవకాశం!

ఇస్రోకు చెందిన స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఎస్ఏసీ) అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

అప్రెంటీస్​షిప్: గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, ట్రేడ్. 

ఖాళీలు: 16. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బి.టెక్/ బి.ఆర్క్/ బి.కాం/ బి.లైబ్రరీ లేదా సమాన అర్హత ఉండాలి. కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్/ టెక్నాలజీలో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. ఎస్ఎస్​సీ/ పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 35ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

వాక్​ఇన్ ఇంటర్వ్యూలు: జూన్ 20 నుంచి జులై 30 వరకు .

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.apprenticeshipindia.gov.inను సందర్శించండి.