నారాయణ ఖేడ్ జూకల్ శివారులోని ఫుడ్ సరిగ్గా లేదని స్టూడెంట్స్ ఆందోళన

నారాయణ ఖేడ్ జూకల్ శివారులోని ఫుడ్ సరిగ్గా లేదని స్టూడెంట్స్ ఆందోళన

నారాయణ్ ఖేడ్, వెలుగు: మెనూ ప్రకారం ఫుడ్ పెట్టడంలేదని నారాయణఖేడ్ జూకల్ శివారులోని ఆశ్రమ పాఠశాల స్టూడెంట్స్ గురువారం ఉదయం టిఫిన్ ప్లేట్లతో నేషనల్ హైవేపై నిరసన వ్యక్తం చేశారు. 15 రోజుల నుంచి ఫుడ్ క్వాలిటీగా ఉండడం లేదని ఆరోపించారు. కుళ్లిపోయిన కూరగాయలు, ఉడకని అన్నం, నీళ్ల చారుతో సరిపెడుతున్నారన్నారు. పలుమార్లు విషయాన్ని వార్డెన్ దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. 

స్టూడెంట్స్ నిరసన వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ వెంకట్ రెడ్డి, ఎస్ఐ శ్రీశైలం విద్యార్థులకు నచ్చజెప్పి సమస్యను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పడంతో నిరసన విరమించారు. అనంతరం హాస్టల్ విజిట్ చేసిన గిరిజన అభివృద్ధి అధికారి వార్డెన్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా స్టూడెంట్స్​కు క్వాలిటీ భోజనం పెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.