
భద్రాచలం, వెలుగు: భద్రాచలం పట్టణంలోని గిరిజన గురుకుల కళాశాలలో సోమవారం స్టూడెంట్లు ధర్నా చేశారు. ఇటీవల గురుకుల కాలేజీలో టిఫిన్‌లో పురుగులు వచ్చిన నేపథ్యంలో ప్రిన్సిపల్ పద్మావతి, వార్డెన్ రాజేశ్వరీలను అధికారులు సస్పెండ్ చేశారు. తమ ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ స్టూడెంట్లు ఆందోళన చేపట్టారు.
కాలేజీలో ధర్నా చేశారు. ప్రిన్సిపల్ సస్పెండ్‌ను ఎత్తివేయాలని నినాదాలు చేశారు.