
కుంటాల, వెలుగు : నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని కల్లూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గురువారం రాస్తారోకోకు దిగారు. తమ స్కూల్‌కు చెందిన టీచర్లను డిప్యుటేషన్‌పై వేరే స్కూళ్లకు పంపడాన్ని నిరసిస్తూ పాఠశాల మెయిన్ గేట్‌కు తాళం వేసి, జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. క్లాస్‌లు ప్రారంభమై మూడు నెలలు గడుస్తుండగా.. ఇప్పుడు ఇద్దరు టీచర్లను డిప్యుటేషన్‌పై పంపడంతో తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
స్టూడెంట్ల రాస్తారోకోతో నిర్మల్– బైంసా రహదారిపై ట్రాఫిక్‌జామ్ అయింది. విషయం తెలుసుకున్న ఎస్సై అశోక్, తహసీల్దార్ కమల్‌సింగ్ వచ్చి స్టూడెంట్లకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. రూల్స్ ప్రకారమే టీచర్లను డిప్యుటేషన్ చేశామని, పూర్తి రిపోర్ట్‌ను డీఈవోకు పంపిస్తామని ఎంఈవో ముత్యం చెప్పారు.