ఓయూలో కరోనా కలకలం: ఎగ్జామ్స్ కు ముందు కరోనా పరీక్షలు చేయాలని విద్యార్థినుల నిరసన  

ఓయూలో కరోనా కలకలం: ఎగ్జామ్స్ కు ముందు కరోనా పరీక్షలు చేయాలని విద్యార్థినుల నిరసన  

హైదరాబాద్:  ఓయూలోని లేడీస్ హాస్టల్ లో గురువారం 150 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఆరు మందికి పాజిటివ్ ఉన్నట్టు తేలిందని తెలిపారు డాక్టర్లు. అయితే ఆరు మంది అమ్మాయిలు చాలా మందితో కలిసి భోజనం చేయటం, లేడీస్ హాస్టల్లో తిరగటం, కాలేజీకి వెళ్లారని చెప్పారు. దీంతో మిగతా లేడీస్ హాస్టల్ లో ఉన్న అందరికీ కరోనా పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే కాలేజీలో మూడో సెమిస్టర్ పరీక్షలు ఉండటంతో  కాలేజీకి వెళ్లి ఎగ్జామ్స్ రాస్తే చాలా ప్రమాదం ఉంది. అందరికీ కరోనా టెస్టులు చేసిన తర్వాతే ఎగ్జామ్స్ నిర్వహించాలని డిమాండ్ చేశారు విద్యార్థినులు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు ఉదయం నుంచి అమ్మాయిలు కూర్చున్నా ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా స్పందించడం లేదని తెలిపారు స్టూడెంట్స్. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని, అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాత మూడో సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.